కీర్తనలు త్యాగరాజు ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి
సారంగ - దేశాది
పల్లవి:
ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి
ఎవరీడు ముజ్జగములలోఁ దన కెం..
అను పల్లవి:
చెంతఁజేరి సౌజన్యుఁడై పలికి
చింత బాగ తొలగించి బ్రోచితివి ఎం..
చరణము(లు):
మున్ను మీ సమీపమున వెలయు స
న్మునులనెల్ల నణిమాది లీలలచేఁ
దిన్నగాను పాలనఁ జేసి నటు
నన్నుఁ గాచితివి త్యాగరాజనుత ఎం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMta bhaagyamoo maapaala.r galgitivi ( telugu andhra )