కీర్తనలు త్యాగరాజు ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య
ముఖారి - రూపకము
పల్లవి:
ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య ॥మెం॥
అను పల్లవి:
దాంతులు వరకాంతలు జగమంత నిండియుండఁగ ॥నెం॥
చరణము(లు):
కనులార సేవించి కమ్మని ఫలముల నొసఁగి
తనువు పులకరించఁ బాదయుగములకు మ్రొక్కి
ఇనకులపతి సముఖంబున పునరావృత్తి రహిత పద
మును పొందిన త్యాగరాజ నుతురాలి పుణ్యమ్మును ॥ఎం॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMtani nee varNiMtunu shabariibhaagya ( telugu andhra )