కీర్తనలు త్యాగరాజు ఎంతనేర్చిన ఎంతజూచిన
సింధుధన్యాసి - దేశాది (ఉదయరవిచంద్రిక - దేశాది)
పల్లవి:
ఎంతనేర్చిన ఎంతజూచిన
ఎంతవారలైన కాంతదాసులే ॥ఎం॥
అను పల్లవి:
సంతతంబు శ్రీకాంతస్వాంత సి
ద్ధాంతమైన మార్గ చింతలేని వా ॥రెం॥
చరణము(లు):
పరహింస పరభామాన్యధన
పరమానవాపవాద
పరజీవనమ్ముల కనృతమే
భాషించేరయ్య త్యాగరాజ నుత ॥ఎం॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMtaneerchina eMtajuuchina ( telugu andhra )