కీర్తనలు త్యాగరాజు ఎంతరాని తన కెంత పోని నీ
హరికాంభోజి - దేశాది
పల్లవి:
ఎంతరాని తన కెంత పోని నీ
చింత విడువఁజాల శ్రీరామ ఎం..
అను పల్లవి:
అంతకారి నీ చెంతఁ జేరి హను
మంతుఁడై కొలువలేదా ఎం..
చరణము(లు):
శేషుఁడు శివునికి భూషుఁడు లక్ష్మణ
వేషియై కొలువలేదా ఎం..
శిష్టుఁడు మౌనివరిష్ఠుఁడు గొప్ప వ
శిష్ఠుడు హితుఁడు గాలేదా ఎం..
నరవర నీకై సురగణమును వా
నరులై కొలువగలేదా ఎం..
ఆగమోక్తమగు నీ గుణముల శ్రీ
త్యాగరాజు బాడఁగ లేదా ఎం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMtaraani tana keMta pooni nii ( telugu andhra )