కీర్తనలు త్యాగరాజు ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ
తోడి - త్రిపుట
పల్లవి:
ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ కెం..
అను పల్లవి:
సందడియని మఱచితివో ఇందులేవో నీ కెం..
చరణము(లు):
సారెకు దుర్విషయసార మనుభవించు
వారి చెలిమి సేయనేరక మేను
శ్రీరామ సగమాయెఁ జూచి చూచి
నీరజదళనయన నిర్మలాపఘన ఎం..
తీరని భవనీరధి యాఱడి సైరింప
నేరక భయమందఁగఁ బంకజపత్ర
నీరువిత మల్లాడఁగ ఇట్టి నను జూచి
నీరదాభశరీర నిరుపమ శూర ఎం..
జాగేల యిది సమయమేగాదు చేసితే
ఏ గతి బలుకవయ్య శ్రీరామ నీ
వేగాని దరిలేదయ్య దీనశరణ్య
త్యాగరాజ వినుత తారక చరిత ఎం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMduku dayaraaduraa shriiraamachaMdra nii ( telugu andhra )