కీర్తనలు త్యాగరాజు ఎందుకు నిర్దయ ఎవరున్నారురా
హరికాంభోజి - దేశాది
పల్లవి:
ఎందుకు నిర్దయ ఎవరున్నారురా ॥ఎం॥
ఇందునిభానన ఇనకులచందన ॥ఎం॥
పరమపావన పరిమళాపఘన ॥ఎం॥
నే పరదేశీ బాపవే గాసి ॥ఎం॥
ఉడుతభక్తిగని ఉప్పతిల్లఁగ లేదా ॥ఎం॥
శత్రుల మిత్రుల సమముగఁజూచే నీ ॥కెం॥
ధరలో నీవై త్యాగరాజుపై ॥ఎం॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMduku nirdaya evarunnaaruraa ( telugu andhra )