కీర్తనలు త్యాగరాజు ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య
దర్బారు - త్రిపుట
పల్లవి:
ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ
ఇపుడైన దెలుపవయ్య ॥ఎందుండి॥
అను పల్లవి:
అంద చందము వేరై నడత లెల్ల త్రిగు
ణాతీతమై యున్నదుగాని శ్రీరామ ॥ఎందుండి॥
చరణము(లు):
చిటుకంటె నపరాధ చయములఁ దగిలించే శివలోకముగాదు
వటరూపుఁడై బలిని వంచించి మణచువాని వైకుంఠముగాదు
విట వచనము లాడి శిరము ద్రుంప బడ్డ విధిలోకముగాదు
ధిటవు ధర్మము సత్యము మృదు భాషలు గలుగు
దివ్యరూప త్యాగరాజ వినుత నీ ॥వెందుండి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMduMDi veDalitivoo? eevuuroo nee teliya ipuDaina delupavayya ( telugu andhra )