కీర్తనలు త్యాగరాజు ఎన్నడు చూతునో ఇనకులతిలక ని
కలావతి - ఆది
పల్లవి:
ఎన్నడు చూతునో ఇనకులతిలక ని న్నె..
అను పల్లవి:
పన్నగశయన! భక్తజనావన!
పున్నమచందురుఁబోలు ముఖమ్మును ఎ..
చరణము(లు):
ధరణిజ సౌమిత్రి భరత రిపుఘ్న వా
నరయూథపతి వరుఁడాంజనేయుఁడు
కరుణను ఒకరికొకరు వర్ణింప నా
దరణను బిలిచే నిను త్యాగరాజార్చిత! ఎ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ennaDu chuutunoo inakulatilaka ni ( telugu andhra )