కీర్తనలు త్యాగరాజు ఎవరికై యవతారమెత్తితివివో - యిపుడైన తెలుపవయ్య
దేవమనోహరి - చాపు
పల్లవి:
ఎవరికై యవతారమెత్తితివివో?
యిపుడైన తెలుపవయ్య రామయ్య నీ ॥ఎవరికై॥
అను పల్లవి:
అవనికి రమ్మని పిలిచిన మహరా
జెవఁడో వానికి మ్రొక్కెద రామ ॥ఎవరికై॥
చరణము(లు):
వేదవర్ణ నీయమౌ నామముతో
విధి రుద్రులకు మేల్మియగు రూపముతో
మోద సదనమగు పటు చరితముతో
మునిరాజ వేషియై త్యాగరాజనుత! ॥ఎవరికై॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - evarikai yavataaramettitivivoo - yipuDaina telupavayya ( telugu andhra )