కీర్తనలు త్యాగరాజు ఎవరిచ్చిరిరా శరచాపము; నీ? నికకులాబ్ధి చంద్ర
మధ్యమావతి - ఆది
పల్లవి:
ఎవరిచ్చిరిరా శరచాపము, నీ? నికకులాబ్ధి చంద్ర ॥ఎవ॥
అను పల్లవి:
అవతరించు వేళ నుండెనో? లేక
యవని కేగి యార్జించితివో? శ్రీరామ! నీ ॥కెవ॥
చరణము(లు):
ఒకటేసి యైనఁ బది నూరై వెయ్యై
పకపక లాడి శత్రుల నణచెనట
వికలుని కాకిని బ్రోవ త్రిమూర్తులు వెనుకఁ దీసినారట
సకల ద్రుమకుల్యుల నదీపతికై సంహరించెనట
ప్రకట కీర్తిగల్గిన కోదండ పాణి! శ్రీత్యాగరాజనుత! నీ ॥కెవ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - evarichchiriraa sharachaapamu; nii? nikakulaabdhi chaMdra ( telugu andhra )