కీర్తనలు త్యాగరాజు ఎవరితో నే దెల్పుదు రామ
మానవతి - దేశాది
పల్లవి:
ఎవరితో నే దెల్పుదు రామ
నాలోని జాలిని ఎ..
అను పల్లవి:
కలగొని సదా భజనసేయ
కార్యములన్ని వేరాయ ఎ..
చరణము(లు):
గణనాథు జేయ కోరగ కడు వానరుడై తీరెగ
గుణమయా మయాంబుద సమీర
గోపాల త్యాగరాజ నుత ఎ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - evaritoo nee delpudu raama ( telugu andhra )