కీర్తనలు త్యాగరాజు ఏ తావున నేర్చితివో రామ; యెందుకింత గాసి
యదుకులకాంభోజి - దేశాది
పల్లవి:
ఏ తావున నేర్చితివో రామ; యెందుకింత గాసి ॥ఏ॥
అను పల్లవి:
సీతా లక్ష్మణ భరత రిపుఘ్న
వాతాత్మజులతో నాడు నాటక ॥మే॥
చరణము(లు):
ఆలు వజ్రాలు సొమ్ము లడిగిరో
అనుజులు తల్లి దండ్రు లన్న మడిగిరో?
శీలులైన వర భక్తులు బిలచిరో?
చిరకాలము త్యాగరాజనుత! ॥ఏ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ee taavuna neerchitivoo raama; yeMdukiMta gaasi ( telugu andhra )