కీర్తనలు త్యాగరాజు ఏతావునరా నిలుకడనీకు - ఎంచిచూడ నగపడవు
కల్యాణి - దేశాది
పల్లవి:
ఏతావునరా నిలుకడనీకు - ఎంచిచూడ నగపడవు ॥ఏ॥
అను పల్లవి:
సీతా గౌరీ వాగీశ్వరి యను
స్త్రీ రూపములందా గోవిందా ॥ఏ॥
చరణము(లు):
భూకమలార్కానిల నభమందా
లోకకోటు లందా
శ్రీకరుఁడగు త్యాగరాజ కరార్చిత
శివ మాధవ బ్రహ్మాదుల యందా ॥ఏ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eetaavunaraa nilukaDaniiku - eMchichuuDa nagapaDavu ( telugu andhra )