కీర్తనలు త్యాగరాజు ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో
భైరవి - ఆది
పల్లవి:
ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో ఏ..
అను పల్లవి:
శ్రీనాథ బ్రహ్మకైన నీదు సేవ దొరకునా తనకు గలిగెను ఏ..
చరణము(లు):
నేను గోరిన కోర్కులెల్లను నేఁడు తనకు నెరవేరెను
భానువంశతిలక నా పాలి భాగ్యమా సజ్జన యోగ్యమా ఏ..
నీదు దాపు నీదు ప్రాపు దొరికెను నిజముగా నే నీసొమ్మైతిని
ఆదిదేవ ప్రాణనాథ నా దంకముననుంచి పూజించ తన కే..
సుందరేశ సుగుణబృంద దశరథనంద నారవిందనయన పావన
అందగాఁడ త్యాగరాజనుత సుఖమనుభవింప దొరకెరా భళి తన కే..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eenaaTi noomu phalamoo ee daana balamoo ( telugu andhra )