కీర్తనలు త్యాగరాజు ఏలావతార మెత్తుకొంటివి ఏమికారణము రాముఁడై
ముఖారి - ఆది
పల్లవి:
ఏలావతార మెత్తుకొంటివి ఏమికారణము రాముఁడై ఏ..
అను పల్లవి:
ఆలము సేయుటకా అయోధ్య
పాలనఁ జేయుటకా ఓ రాఘవ ఏ..
చరణము(లు):
యోగులను జూచుటకా భవ
రోగులను బ్రోచుటకా శత
రాగరత్నమాలికలు రచించిన
త్యాగరాజునకు వర మొసంగుటకా ఏ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eelaavataara mettukoMTivi eemikaaraNamu raamu.rDai ( telugu andhra )