కీర్తనలు త్యాగరాజు ఏహి త్రిజగదీశ! శంభో! మాం పాహి పంచనదీశ
సారంగ - చాపు
పల్లవి:
ఏహి త్రిజగదీశ! శంభో! మాం
పాహి పంచనదీశ ॥ఏహి॥
అను పల్లవి:
వాహినీశ రిపునుత శివ సాంబ
దేహి త్వదీయ కరాబ్జావలంబం ॥ఏహి॥
చరణము(లు):
గంగాధర ధీర నిర్జర రిపు - పుంగవ సంహార
మంగళకరపురభంగ విధృత సుకు
రం గాప్త హృదయాబ్జభృంగ శుభాంగ ॥ఏహి॥
వారనాజినచేల భవనీరధి తరణ సురపాల
క్రూర లోకాభ్రసమీరణ శుభ్రశ
రీర మామకాఘహర పరాత్పర ॥ఏహి॥
రాజశేఖర కరుణాసాగర నగ రాజాత్మజా రమణ
రాజరాజ పరిపూజిత పద త్యాగ
రాజరాజ వృషరాజాధిరాజ ॥ఏహి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eehi trijagadiisha! shaMbhoo! maaM paahi paMchanadiisha ( telugu andhra )