కీర్తనలు త్యాగరాజు ఓరచూపు జూచేది న్యాయమా
కన్నడగౌళ - దేశాది
పల్లవి:
ఓరచూపు జూచేది న్యాయమా
ఓ రఘూత్తమా నీవంటివానికి ॥ఓ॥
అను పల్లవి:
నీరజాక్ష మును నీదాసులకు
నీకేటివాపులు దెల్పవె ॥ఓ॥
చరణము(లు):
మానమించుకైన నీకుఁ దోచలేకపో
యిన వైనమేమి పుణ్యరూపమా
దీనరక్షక! శ్రిత మానవ సం
తాన! గానలోల! త్యాగరాజనుత ॥ఓ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - oorachuupu juucheedi nyaayamaa ( telugu andhra )