కీర్తనలు త్యాగరాజు కదలేవాఁడుగాఁడే రాముఁడు - కథలెన్నోగలవాఁడె
నారాయణగౌళ - ఆది
పల్లవి:
కదలేవాఁడుగాఁడే రాముఁడు - కథలెన్నోగలవాఁడె ॥క॥
అను పల్లవి:
మొదలే తానైనాఁడే - తుదిమొదలే లేనివాఁడైనాడే ॥క॥
చరణము(లు):
కల్పన లెన్నడులేఁడు సం - కల్పములే గలవాఁడు శేష
తల్పశయనుఁడే వాఁడు శ్రీ - త్యాగరాజనుతుఁడై నాఁడే ॥క॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kadaleevaa.rDugaa.rDee raamu.rDu - kathalennoogalavaa.rDe ( telugu andhra )