కీర్తనలు త్యాగరాజు కన కన రుచిరా కనకవసన! నిన్ను
వరాళి - ఆది
పల్లవి:
కన కన రుచిరా కనకవసన! నిన్ను క..
అను పల్లవి:
దిన దినమును మనసున చనువున నిన్ను క..
చరణము(లు):
పాలుగారు మోమున శ్రీయపార మహిమ దనరు నిన్ను క..
బాలార్కాభిసుచేల మణిమయ
మాలాలంకృత కందర సర
సిజాక్ష వరకపోల సురుచిర కిరీటధర
సంతతంబు మనసారగ క..
సాపత్నిమాతయౌ సురుచిచే
కర్ణశూలమైన మాట వీనులఁ
జురుక్కన తాళక శ్రీహరిని ధ్యానించి
సుఖింపగ లేదా యటు క..
మృగమదలలామ శుభనిటల వర
జటాయు మోక్షఫలద పవమాన
సుతుఁడు నీదు మహిమఁ దెల్ప
సీత దెలిసి వలచి సొక్క లేదా యారీతి నిన్ను క..
కామించి ప్రేమమీర కరముల నీదు
పాద కమలములఁ బట్టుకొను
వాఁడు సాక్షి రామనామ రసికుఁడు
కైలాస సదనుఁడు సాక్షి
మఱియు నారద పరాశర శుక
శౌనక పురందర నగజా ధరజ
ముఖ్యులు సాక్షిగాద సుందరేశ
సుఖ కలశాంబుధివా సాశ్రితులకే క..
సుఖస్పద విముఖాంబుధర
పవనవిదేహ మానస విహారా ప్త
సురభూజమానిత గుణాంక చిదా
నంద ఖగతురంగ ధృతరథాంగ
పరమ దయాకర కరుణారస
వరుణాలయ భయాపహార శ్రీరఘుపతే కన..
కలమను ముఖ కళ గలిగిన సీత
కులుకుచు నోర కన్నులను జూచు నిన్ను క..
సతతము ప్రేమ పూరితుఁడగు త్యాగరాజ
నుత ముఖజిత కుముదహిత వరద నిన్ను క..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kana kana ruchiraa kanakavasana! ninnu ( telugu andhra )