కీర్తనలు త్యాగరాజు కనుగొను సౌఖ్యము, కమలజుకైన గల్గునా
నాయకి - రూపకం
పల్లవి:
కనుగొను సౌఖ్యము, కమలజుకైనఁ గల్గునా ॥కనుగొను॥
అను పల్లవి:
దనుజ వైరియగు రాముని దయ గల్గిన నతని వినా ॥కనుగొను॥
చరణము(లు):
తనువొకచో మనసొకచో దగిన వేషమొకచో నిడి
జనుల నేచువారికి జయమౌనే త్యాగరాజు ॥కనుగొను॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kanugonu saukhyamu, kamalajukaina galgunaa ( telugu andhra )