కీర్తనలు త్యాగరాజు కనులు తాకని పరకాంతల మనసెటులో రామ
కల్యాణ వసంత - రూపక
పల్లవి:
కనులు తాకని పరకాంతల మనసెటులో రామ క..
అను పల్లవి:
ననబోణులపై నేరమన నోరేమి రామ క..
చరణము(లు):
ఘోరభూతపతినిజూచి దారుకారణ్యసతులు
మేరమీఱి భువిని యపదూరు గల్గజేసిరే క..
మన మోహనానంద మదచకోరనయన కుందర
దన చంద్రవదన సుందరాంగ త్యాగ రాజవినుత క..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kanulu taakani parakaaMtala manaseTuloo raama ( telugu andhra )