కీర్తనలు త్యాగరాజు కరుణ ఏలాగంటే నీ విధమే కల్యాణసుందర రామ
వరాళి - ఆది
పల్లవి:
కరుణ ఏలాగంటే నీ విధమే కల్యాణసుందర రామ క..
అను పల్లవి:
పరమాత్ముఁడు జీవాత్ముఁడు యొకఁడై
బరగుచుండు భక్తపరాధీనుని క..
చరణము(లు):
అనృతంబాడఁడు అల్పుల వేడఁడు
సునృపుల గొలువఁడు సూర్యుని మఱవఁడు క..
మాంసము ముట్టఁడు మధువును త్రాగఁడు
పరహింసల సేయఁడు యెఱుకను మఱవఁడు క..
మూడీషణముల వాడఁడు జీవ
న్ముక్తుఁడై తిరుగు మదమును జూపఁడు క..
వంచన సేయఁడు పరులతో బొంకఁడు
చంచలచిత్తుఁడై సౌఖ్యము విడవఁడు క..
సాక్షియనిదెలిసి యందు లక్ష్యము విడువఁడు కం
జాక్షుని త్యాగరాజ రక్షఁకుడైనవాని క..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - karuNa eelaagaMTee nii vidhamee kalyaaNasuMdara raama ( telugu andhra )