కీర్తనలు త్యాగరాజు కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా
కుంతలవరాళి - దేశాది
పల్లవి:
కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా క..
అను పల్లవి:
ఇలను వెలయు వర వృష రాజుల కటు
కులరుచి తెలియు చందముగా నీ క..
చరణము(లు):
దారసుతులకై ధనములకై యూరు
పేరులకై బహు పెద్దతనముకై
సారెకు భక్తవేసముకొనువారికి
తారకనామ శ్రీ త్యాగరాజార్చిత క..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kali narulaku mahimalu delipeemi phalamanaleedaa ( telugu andhra )