కీర్తనలు త్యాగరాజు కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ!
పూర్ణలలిత - ఆది
పల్లవి:
కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ! ॥కలుగునా॥
అను పల్లవి:
పలుమారు జూచుచు బ్రహ్మానందుఁడై
బరగెడు భక్తాగ్రేసర! తనకు ॥కలుగునా॥
చరణము(లు):
వేకువ జామున నీ కరమున నిడి
శ్రీకాంతుఁ డమృత స్నానము జేసి తా సీ,
తా కరములచే భుజించి నిను సా
త్వీక పురాణ పఠన జేయుమను
సాకేత పతిని సర్వాధారుని
ప్రాకటముగ త్యాగ రాజనుతుని గన ॥కలుగునా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kalugunaa padaniiraja seeva? gaMdhavaaha tanaya! ( telugu andhra )