కీర్తనలు త్యాగరాజు కారుబారు సేయువారు గలరే? నీవలె సాకేత నగరిని
ముఖారి - ఆది
పల్లవి:
కారుబారు సేయువారు గలరే? నీవలె సాకేత నగరిని ॥కారు॥
అను పల్లవి:
ఊరివారు దేశజనులు వరమునులు
ఉప్పొంగుచును భావకులయ్యెడు ॥కారు॥
చరణము(లు):
నెలకు మూఁడువాన లఖిల విద్యల
నేర్పు గలిగి, దీర్ఘాయువు గలిగి
చలము గర్వరహితులు గాలేద?
సాధు త్యాగరాజ వినుత రామ! ॥కారు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kaarubaaru seeyuvaaru galaree? niivale saakeeta nagarini ( telugu andhra )