కీర్తనలు త్యాగరాజు కాలహరణ మేలరా హరే సీతారామ
శుద్ధసావేరి - రూపకము
పల్లవి:
కాలహరణ మేలరా హరే సీతారామ ॥కా॥
అను పల్లవి:
కాలహరణ మేల సుగుణజాల కరుణాలవాల ॥కా॥
చరణము(లు):
చుట్టుచుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భువిని
పుట్టులేక నీ పదములఁ బట్టుకొన్న నన్నుఁ బ్రోవ ॥కా॥
పొడవున ఎంతాడుకొన్న భూమిని త్యాగంబురీతి
కడువేల్పుల మున్న నీవుగాక యెవరు నన్నుఁబ్రోవ ॥కా॥
దినదినమును దిర్గితిర్గి దిక్కులేక శరణుఁజొచ్చి
తనువుధనము నీదెయంటి త్యాగరాజ వినుత రామ ॥కా॥
ఇష్టదైవమా మనోభీష్ట మీయలేక ఇంకఁ
గష్టమా త్యాగరాజు కామితార్థ ఫలమొసంగ ॥కా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kaalaharaNa meelaraa haree siitaaraama ( telugu andhra )