కీర్తనలు త్యాగరాజు కాసిచ్చెడిదే గొప్పాయనురా - కలిలో రాజులకు
గౌళిపంతు - ఆది
పల్లవి:
కాసిచ్చెడిదే గొప్పాయనురా - కలిలో రాజులకు ॥కా॥
అను పల్లవి:
హరి దాసులు సేవింపరనుచు ప్రభువులు
దయ మానిరి, పర మెంచక పోయిరి ॥కా॥
చరణము(లు):
రాజాంగము కొరకు నాల్గుజాతుల రక్షణ పరసుఖమో?
రాజసులై సన్మార్గ మెఱుఁగక పరాకు సేయ ఘనమో?
ఆజన్మము గొలిచి విప్రవరుల కానందము గలదో? త్యాగ
రాజవినుత! నీ మాయగాని
నీరజనయన! సుజనాఘ విమోచన! ॥కా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kaasichcheDidee goppaayanuraa - kaliloo raajulaku ( telugu andhra )