కీర్తనలు త్యాగరాజు కుల బిరుదును బ్రోచుకొమ్ము రమ్ము
దేవమనోహరి - రూపకం
పల్లవి:
కుల బిరుదును బ్రోచుకొమ్ము రమ్ము ॥కుల॥
అను పల్లవి:
ఇలగల భూదేవ సురా
దుల కాధారుఁడగు నీ ॥కుల॥
చరణము(లు):
నిగమాగమచర! నీకు
నిత్య మంగళము గల్గు
వగ సేయకు రామ
వందిత త్యాగరాజ ॥కుల॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kula birudunu broochukommu rammu ( telugu andhra )