కీర్తనలు త్యాగరాజు కృప జూచుటకు వేళరా రామా
ఛాయాతరంగిణి - ఆది
పల్లవి:
కృప జూచుటకు వేళరా రామా ॥కృప॥
అను పల్లవి:
అపరాధముల నోర్వవశమా
యన బోకవే సరివారలలో ॥కృప॥
చరణము(లు):
పరమార్థమౌ మార్గమెఱుఁగరు
ప్రభువులెల్ల నీచ సేవకులురా!
పరలోక భయ మెంత గానరు
వర త్యాగరాజ హృత్సదన! ॥కృప॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kR^ipa juuchuTaku veeLaraa raamaa ( telugu andhra )