కీర్తనలు త్యాగరాజు కొనియాడెడి నాయెడ దయ వెలకు
కోకిలధ్వని - ఆది
పల్లవి:
కొనియాడెడి నాయెడ దయ వెలకు
గొనియాడెదవు సుమీ రామ నిను ॥కొని॥
అను పల్లవి:
అనయము నీ మనసును గనిపొంగుచు
అంతరమున నతి ప్రేమతో నిను ॥కొని॥
చరణము(లు):
వింత వింత మతములలోఁ జొరబడి
వెతఁజెందగ లేఁడను నీ మనసు
కింత దెలిసి త్యాగరాజ సన్నుత
యే వేళను నీ శుభ చరితమును ॥కొని॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - koniyaaDeDi naayeDa daya velaku ( telugu andhra )