కీర్తనలు త్యాగరాజు కొలువమరెఁ గదా? కోదండపాణి
తోడి - ఆది
పల్లవి:
కొలువమరెఁ గదా? కోదండపాణి కొ..
అను పల్లవి:
నలువకుఁ బలుకుల చెలియకు రుక్మిణికి
లలితకు సీతకు లక్ష్మణుని కరుదైన కొ..
చరణము(లు):
వేకువజామున వెలయుచుఁ దంబురఁ
జేకొని గుణములఁ జెలువొందఁ బాడుచు,
శ్రీకరుని కాశ్రితచింతామణికిని
ఆకలిదీరఁ బాలారగింపను జేసే కొ..
వినవయ్య సరిప్రొద్దువేళ నాథునికిఁ
జనువున పన్నీట స్నానముఁ గావించి,
ఘనునికి దివ్యభోజనమును బెట్టి క
మ్మని విడెమొసంగుచు మఱవక సేవించే కొ..
భాగవతులుగూడి బాగుగా ఘననయ
రాగములచే దీపారాధన మొనరించి,
వేగమె శ్రీహరి విరులపైఁ బవ్వళించ
జోకొట్టి త్యాగరాజు సుముఖుని లేపే కొ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - koluvamare.r gadaa? koodaMDapaaNi ( telugu andhra )