కీర్తనలు త్యాగరాజు కొలువై యున్నాడే కోదండపాణి
దేవగాంధారి - ఆది
పల్లవి:
కొలువై యున్నాడే కోదండపాణి కొ..
అను పల్లవి:
సలలితమతులై సారెకుశీలులై
వలచుచు గోరివచ్చి సేవింపరే కొ..
చరణము(లు):
జనకజభరతాదులతో మంచి నైవేద్యంబులు
చనువున వేడుక నారగించి మెఱుపుకోట్లఁ గేరు
కనకపటము సొమ్ములను ధరించి వేదోక్తమైన
సనకవచనములచే తోషించి శ్రితులబోషించి కొ..
వరమగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుగుచు
సురవారసతులు బాగ నటింప నదిగాక
పరాశరనారదమునులెల్ల నుతింప ఎంతెంతో నెనరున
సురపతి వాగీశులు సేవింప మేను పులకరింప కొ..
ఉడురాజముఖుఁడు శేషశయ్యపైని చెలంగఁగఁ గని
పుడమికుమారి సుగంధముఁ బూయ నమ్మినవారలకే
కడగంటినిఁ గోరిన వరమీయ త్యాగరాజు నెనరున
అడుగడుగుకు మడపుల నందీయ శ్రీరామయ్య కొ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - koluvai yunnaaDee koodaMDapaaNi ( telugu andhra )