కీర్తనలు త్యాగరాజు క్షీరసాగర విహార అపరిమిత ఘోర పాతక విదార
ఆనందభైరవి - ఝంప
పల్లవి:
క్షీరసాగర విహార అపరిమిత ఘోర పాతక విదార
క్రూర జనగణ విదూర నిగమ సంచార సుందర శరీర ॥క్షీర॥
చరణము(లు):
శతమఖాహిత విభంగ శ్రీరామ
శమనరిపు సన్ను తాంగ
శ్రిత మానసాంతరంగ జనకజా
శృంగార జలజభృంగ ॥క్షీర॥
రాజాధి రాజ వేష శ్రీరామ
రమణీయ కర సుభూష
రాజనుత లలితభాష శ్రీత్యాగ
రాజాది భక్తపోష ॥క్షీర॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - xiirasaagara vihaara aparimita ghoora paataka vidaara ( telugu andhra )