కీర్తనలు త్యాగరాజు గతి నీవని నే కోరి వచ్చితి తల్లి పరాకా?
తోడి - ఆది
పల్లవి:
గతి నీవని నే కోరి వచ్చితి తల్లి పరాకా? ॥గతి॥
అను పల్లవి:
మతిని యెంతో వెతకి సమ్మతిని శ్రీ ప్రవృద్ధ శ్రీ
మతి నీ పదయుగముల నే నెర న
మ్మితిని బ్రోవు మిక నిజదాసులకు ॥గతి॥
చరణము(లు):
వరమౌ శ్రీతపస్తీర్థ న
గరమందు నెలకొన్న పరమానందీ! పొగడ
తరమా బ్రహ్మకైనను?
ధరలో నీ సరి గాన; తల్లి నీ వాడను గానా?
పరితాపము లెల్ల దొలగ యూరక
పురనాథులు జతగూడి యభీష్ట
వరము లిచ్చు దైవము నీవను మను
స్థితమతులై గాచినారు గనుక ॥గతి॥
ఈ పురమున బాగు
కాపురము సేయువా రే పుణ్యము జేసిరో
శ్రీ పుర నిలయె ప్రాపు కోరి యున్నాను
అంబ పరుల నేను వేడగ లేను
జూపు జూపు సేయక నీవే దరి
దాపు గాని అన్యులెవరు నాయెడ
రేపు మాపనక నీ మహిమలు బలు
గోపురంబుగాని సుజని ॥గతి॥
రాకా శశివదనె సర్వలోకనాయకి
వినుమా యనేక వేల్పు
ల యాదియౌ నీ కటాక్షము చేత
యేక చిత్తమైనందుకు అంబ
ఇంక నిర్దయ యెందుకు
నీకని ధన ధాన్యముల కొరకు యీ
లోకుల నే మాటి మాటి కడుగుట చౌకగాని నీ
కీర్తికి నెందాక విన్నవింతు త్యాగరాజుని ॥గతి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - gati niivani nee koori vachchiti talli paraakaa? ( telugu andhra )