కీర్తనలు త్యాగరాజు గిరిరాజ సుతా తనయ! సదయ
బంగాళ - సురటి ( - దేశాది)
పల్లవి:
గిరిరాజ సుతా తనయ! సదయ ॥గి॥
అను పల్లవి:
సురనాథముఖార్చిత పాదయుగ
పరిపాలయ మా మిభరాజముఖ ॥గి॥
చరణము(లు):
గణనాథ పరాత్పర శంకరా
గమ వారినిధి రజనీ కర
ఫణిరాజ కంకణ విఘ్ననివా
రణ శాంభవ శ్రీత్యాగరాజ నుత ॥గి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - giriraaja sutaa tanaya! sadaya ( telugu andhra )