కీర్తనలు త్యాగరాజు గురులేక యెటువంటి గుణికిఁ దెలియఁగబోదు
గౌరీమనోహరి - జంప
పల్లవి:
గురులేక యెటువంటి గుణికిఁ దెలియఁగబోదు గు..
అను పల్లవి:
కఱుకైన హృద్రోగ గహనమును గొట్టను సత్‌ గు..
చరణము(లు):
తనువు సుత ధన దార దాయాది బాంధవులు
జనియించి చెదరు జాలిన కరుణతో
మనసునంటక సేయు మందనుచుఁ దత్త్వ బో
ధనఁ జేసి కాపాడు త్యాగరాజాప్తుడవు గు..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - guruleeka yeTuvaMTi guNiki.r deliya.rgaboodu ( telugu andhra )