కీర్తనలు త్యాగరాజు చక్కని రాజమార్గము లుండఁగ
ఖరహరప్రియ - ఆది
పల్లవి:
చక్కని రాజమార్గము లుండఁగ
సందుల దూరనేలే ఓ మనసా ॥చ॥
అను పల్లవి:
చిక్కని పాలు మీగడ యుండఁగ
చీయను గంగాసాగర మేలే ॥చ॥
చరణము(లు):
కంటికి సుందరతరమగు రూపమే ము
క్కంటినోట చెలగే నామమే త్యాగరా
జింటనే నెలకొన్నది దైవమే యిటు
వంటి శ్రీసాకేతరాముని భక్తియనే ॥చ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - chakkani raajamaargamu luMDa.rga ( telugu andhra )