కీర్తనలు త్యాగరాజు చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా
ఆరభి - ఆది
పల్లవి:
చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా చాల..
అను పల్లవి:
కాలముబోను మాట నిలుచును కల్యాణరామ! నాతో చాల..
చరణము(లు):
తల్లి దండ్రి నేనుండ తక్కిన భయమేలరా యని
పలుమారు నీవెంతో బాసలు జేసి
ఇలలో సరివారలలో ఎంతో బ్రోచుచుండి
పెద్దలతో బల్కి మెప్పించి త్యాగరాజునితో చాల..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - chaala kallalaaDukonna saukhyameemiraa ( telugu andhra )