కీర్తనలు త్యాగరాజు చింతిస్తున్నాఁడే యముఁడు
ముఖారి - ఆది
పల్లవి:
చింతిస్తున్నాఁడే యముఁడు ॥చింతి॥
అను పల్లవి:
సంతతము సుజనులెల్ల
సద్భజన చేయుటఁజూచి ॥చింతి॥
చరణము(లు):
శూల పాశ ధృత భట
జాలములఁ జూచి మఱి మీ
కోలాహలము లుడుగు
కాల మాయెనే యనుచు ॥చింతి॥
వారధి శోషింప జేయు
క్రూర కుంభజుని రీతి
ఘోర నరకాదుల నణచు
తారక నామమును దలచి ॥చింతి॥
దారి దెలియలేక తిరుగు
వారలైన చాలుననిన
సారమని త్యాగరాజ
సంకీర్తనము బాడెదరని ॥చింతి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - chiMtistunnaa.rDee yamu.rDu ( telugu andhra )