కీర్తనలు త్యాగరాజు చేర రా వదేమిరా? రామయ్య!
రీతిగౌళ - దేశాది
పల్లవి:
చేర రా వదేమిరా? రామయ్య! ॥చేర॥
అను పల్లవి:
మేర గాదురా యిక మహా - మేరుధీర! శ్రీకర! ॥చేర॥
చరనము:
తల్లి తండ్రి లేని బాల తన నాథుఁగోరు రీతి
పలుమారు వేడుకొనిన బాలించ రాదా?
వలచుచు నేను నీదు వదనారవిందమును
దలచి కరఁగగ జూచి త్యాగరాజ సన్నుత! ॥చేర॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - cheera raa vadeemiraa? raamayya! ( telugu andhra )