కీర్తనలు త్యాగరాజు చేసినదెల్ల మఱచితివో? ఓ రామ రామ!
తోడి - ఆది
పల్లవి:
చేసినదెల్ల మఱచితివో? ఓ రామ రామ! చే..
అను పల్లవి:
ఆసకొన్నట్టి నన్నలయించుటకు మున్ను చే..
చరణము(లు):
ఆలు నీకైన భక్తురాలనుచు నాడు
ప్రాలుమాలక రవిబాలుని చెలిమియు చే..
భాష తప్పకను విభీషణుని కొఱ కాది
శేషుఁడగు తమ్ముని పోషించమని రాజు చే..
రామా! శ్రీ త్యాగరాజ ప్రేమావతార! సీతా
భామ మాటలు దెల్ప భీమాంజనేయు బ్రహ్మ చే..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - cheesinadella maRachitivoo? oo raama raama! ( telugu andhra )