కీర్తనలు త్యాగరాజు జయ మంగళం నిత్య శుభ మంగళం
మోహన - జంప
జయ మంగళం నిత్య శుభ మంగళం ॥జ॥
మంగళం మంగళం - మారామచంద్రునకు
మంగళం మంగళం - మాధవునకు ॥జ॥
నిజదాసపాలునకు - నిత్య స్వరూపునకు
నజరుద్రవినుతునకు - నగధరునకు ॥జ॥
నిత్యమై సత్యమై - నిర్మలంబైన యా
దిత్యకులతిలకునకు - ధీరునకును ॥జ॥
రాజాధిరాజునకు - రవికోటితేజునకు త్యాగ
రాజనుతునకు రామ - రత్నమునకు ॥జ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jaya maMgaLaM nitya shubha maMgaLaM ( telugu andhra )