కీర్తనలు త్యాగరాజు జయమంగళం నిత్య శుభమంగళం
ఘంటా - జంప
పల్లవి:
జయమంగళం నిత్య శుభమంగళం ॥జ॥
కరుణారసాక్షాయ కామారివినుతాయ
తరుణారుణాతి సుందరపదాయ
నిరుపమశరీరాయ నిఖిలాగమచరాయ
సురవినుతచరితాయ సువ్రతాయ ॥జ॥
కుందసుమరదనాయ కుంభజసుగేయాయ
మందరాగధరాయ మాధవాయ
కందర్పజనకాయ కామితసుఫలదాయ
బృందారకారాతిభీకరాయ ॥జ॥
సర్వలోకహితాయ సాకేతసదనాయ
నిర్వికారాయ మానితగుణాయ
సార్వభౌమాయ పోషితత్యాగరాజాయ
నిర్వాణఫలదాయ నిర్మలాయ ॥జ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jayamaMgaLaM nitya shubhamaMgaLaM ( telugu andhra )