కీర్తనలు త్యాగరాజు జానకీ నాయక నీకు జయ మంగళం
ధన్యాసి - ఆది
పల్లవి:
జానకీ నాయక నీకు జయ మంగళం నృప
సూన సందరమునకు శుభమంగళం హరే ॥జానకీ॥
చరణము(లు):
ఫాలమునకు నీదు కపాలమునకు మంగళం
నీలవర్ణ నీ పలు వజ్రాలమునకు మంగళం ॥జానకీ॥
యౌవనమునకు చిరునవ్వునకు మంగళం
దువ్విన యలకలమీది పువ్వులకు మంగళం ॥జానకీ॥
మాటలకు రత్నాల కిరీటమునకు మంగళం
నాటక సూత్రధార నీ తేటకండ్లకు మంగళం ॥జానకీ॥
బాణమునకు కుసుమ బాణజనక మంగళం
జాణతనమునకు లోక త్రాణమునకు మంగళం ॥జానకీ॥
ఉంగరమునకు నీ దృష్టాంగమునకు మంగళం
పొంగుచు పదముల నుండు గంగకును మంగళం ॥జానకీ॥
నీ గుణజాలమునకు నిత్య శుభ మంగళం
నాగశయన పాలిత త్యాగరాజ మంగళం ॥జానకీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jaanakii naayaka niiku jaya maMgaLaM ( telugu andhra )