కీర్తనలు త్యాగరాజు జానకీనాయక నీకు - జయమంగళం నృప సూన సుందరమునకు - శుభమంగళం హరే
ధన్యాసి - ఆది
జానకీనాయక నీకు - జయమంగళం నృప
సూన సుందరమునకు - శుభమంగళం హరే ॥జా॥
ఫాలమునకు నీదు క - పోలమునకు మంగళం
నీలవర్ణ నీ పలు వ - జ్రాలమునకు మంగళం ॥జా॥
యౌవనమునకు చిరు - నవ్వునకు మంగళం
దువ్విన యలకలమీది - పువ్వులకు మంగళం ॥జా॥
మాటలకు రత్నాల కి - రీటమునకు మంగళం
నాటకసూత్రధార నీ - తేటకండ్లకు మంగళం ॥జా॥
బాణమునకు కుసుమ - బాణజనక మంగళం
జాణతనమునకు లోక - త్రాణమునకు మంగళం ॥జా॥
ఉంగరమునకు నీ ద - ష్టాంగమునకు మంగళం
పొంగుచు పదములనుండు - గంగకును మంగళం ॥జా॥
నీగుణజాలమునకు - నిత్య శుభమంగళం
నాగశయనపాలిత - త్యాగరాజ మంగళం ॥జా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jaanakiinaayaka niiku - jayamaMgaLaM nR^ipa suuna suMdaramunaku - shubhamaMgaLaM haree ( telugu andhra )