కీర్తనలు త్యాగరాజు జో జో రామ ఆనందఘన జో జో జో రామ
రీతిగౌళ - ఆది
జో జో రామ ఆనందఘన జో జో జో రామ ॥జో॥
జో జో దశరథబాలరామ - జో జో భూజాలోల రామ ॥జో॥
జో జో రఘుకులతిలక రామ - జో జో కుటిలతరాలక రామ ॥జో॥
జో జో నిర్గుణరూప రామ - జో జో సుగుణకలాప రామ ॥జో॥
జో జో రవిశశినయన రామ - జో జో ఫణివరశయన రామ ॥జో॥
జో జో మృదుతరభాష రామ - జో జో మంజులవేష రామ ॥జో॥
జో జో త్యాగరాజార్చిత రామ - జో జో భక్తసమాజ రామ ॥జో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - joo joo raama aanaMdaghana joo joo joo raama ( telugu andhra )