కీర్తనలు త్యాగరాజు తనవారి తనము లేదా? తారకాధిపానన వాదా?
బేగడ - దేశాది
పల్లవి:
తనవారి తనము లేదా? తారకాధిపానన వాదా? ॥తన॥
అను పల్లవి:
ఇనవంశ రాజుల కీగుణము లెన్నడైన గలదా నాదుపై ॥తన॥
చరణము(లు):
పేరపేర బిల్చి హారములు ప్రేమ
మీర మీ దొసగ లేదా నాదుపై ॥తన॥
అలనాడు అన్న మారగించు వేళ
బలు వానరుల పంక్తినుంచ లేదా ॥తన॥
రామ రామ రామ రచ్చ సేయకవే
తామసంబ దేల? త్యాగరాజనుత ॥తన॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tanavaari tanamu leedaa? taarakaadhipaanana vaadaa? ( telugu andhra )