కీర్తనలు త్యాగరాజు తప్పగనే వచ్చునా తనువుకు లంపట నీ కృప
శుద్ధబంగాళ - రూపక
పల్లవి:
తప్పగనే వచ్చునా తనువుకు లంపట నీ కృప త..
అను పల్లవి:
మెప్పులకై కొప్పులుగల మేటిజనులఁజూచి భజన త..
చరణము(లు):
రూకలకై పైకి మంచి కోకలకై యాహారమునకు
నూకలకై ధ్యానించితి త్యాగరాజనుతుని భజన త..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tappaganee vachchunaa tanuvuku laMpaTa nii kR^ipa ( telugu andhra )