కీర్తనలు త్యాగరాజు తెలియలేరు రామ భక్తిమార్గమును
ధేనుక - దేశాది
పల్లవి:
తెలియలేరు రామ భక్తిమార్గమును ॥తె॥
అను పల్లవి:
ఇల నంతట తిరుగుచుఁ గలువరించేరేగాని ॥తె॥
చరణము(లు):
వేగలేచి నీట మునిఁగి భూతిబూసి
వేళ్లనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగపైక మార్జన లోలులై
రేగాని త్యాగరాజవినుత \తె॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - teliyaleeru raama bhaktimaargamunu ( telugu andhra )