కీర్తనలు త్యాగరాజు తొలి నేఁ జేసిన పూజాఫలము
శుద్ధబంగాళ - ఆది
పల్లవి:
తొలి నేఁ జేసిన పూజాఫలము
దెలిసెను నాపాలి దైవమా ॥తొ॥
అను పల్లవి:
పలువిధములనేఁ దలఁచి కరగఁగాఁ
బలుకక నీవటు నేనిటు కాఁగ ॥తొ॥
చరణము(లు):
సరివారలలోఁ జౌకఁ జేసి ఉ
దరపోషకులను బొరుగునఁ జేసి
హరిదాస రహిత పురమున వేసి
దరిజూపకుండఁగ త్యాగరాజార్చిత ॥తొ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - toli nee.r jeesina puujaaphalamu ( telugu andhra )